ఆకాశం
సందడిగా ఉంది. రెపరెపలాడే పతంగులు, కుర్రకారు కేరింతలు... సంధ్య, కెంజాయ
రంగు కళ్ళాపు చల్లి నింగిలో రంగుల చుక్కలేసి ముగ్గులు దిద్దటానికి తయారు
చేసుకున్నట్టుంది. ఇప్పటిదాకా కనిపించని కొత్త పిట్టలు ఆకాశంలో ఈ వింత
విహంగాలేమిటా అని సందడి చేస్తూ కిచకిచలతో కుహు కుహూ రవాతో నన్ను అడిగాయి. అవి మిడిసిపడే ఎగసి'పడే' కాగిత కలలే నని, చెట్టూ పుట్టలపై రాలిన సుమాలనీ, మేడలపై మిద్దెలపై తెగిపడిన రంగుల కలలనీ, ఆధారం లేక గాలి కి ఎగురుతున్న పటాల్నీ, అందనంత దూరం పోయి కంటికి కనిపించని మిగిలిన పతంగులనీ వాటికి చూపి, కంగారేమీలే దని వాటికి సర్ది చెప్పి ఇప్పుడే పంపించాను.
విరబూసిన కమ్మని కబుర్లు... తెలుగును మరువకండి, తెలుగును ప్రేమించండి, తెలుగు వారిగా జీవించండి, గర్వించండి!!
14, జనవరి 2014, మంగళవారం
19, సెప్టెంబర్ 2013, గురువారం
మరింత విశదంగా ........
ఆడు మగాడ్రా ........
అట్లా ఎట్ట కొట్టాడురా ... ఏదో కొమ్మకి అంటు కట్టినట్టు, పద్దతిగా, శ్రద్దగా కొట్టాడురా ....
నిజంగా ఆడు మగాడురా ...
ప్రతినాయకుడిగా భరణి పలికిన మాటలు ఇవి "అతడు" లో
ఇప్పుడే "మాయాబజార్" చిత్రం చూసినాక నాకు గుర్తొచ్చిన మాటలు ఇవి. నిజంగా, ఆయన దర్శకుడు అంటే . ఒక పద్దతిగా కావ్యాన్ని రాసినట్టు ఒక దివ్యమైన శిల్పం చెక్కినట్టు మంచి బొమ్మ గీసినట్టు మొదట్నుంచీ చివరివరకు లేవకుండా చూసినాక ఈ సినిమా భారత దేశాన్ని ఎందుకు మెప్పించి ఒప్పించి ఈ వందేళ్ళ భారత సినిమా చరిత్ర లో అత్యంత అధ్బుత చిత్రం గాఆదరణ పొందిందో మళ్ళీ తెలిసిన్ది.
మొదలుపెట్టటం తోనే "చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా... " అని సమర్త పాట పెట్టటం ఆ రోజుల్లోనే మహిళా ప్రేక్షకుల నాడి పట్టేశారు. ఈ రొజులలో సినిమా చూడాలంటే ఇదు నిముషాలు ఆగి వెడితే పేర్లు అయిపోయి కథ మొదలవుతుందని అనుకునేవాళ్లు గానీ, ఈ పాట తో మహిళా ప్రేక్షకులు విజయ వారి జెండా నుంచి అన్నీ వదిలిపెట్టకుండా చూడాలనుకుని ఉంటారేమో. తెర మీది పాత్రల పరిచయం కూడా ఆ పాట తో అయిపోతుంది . కథ, చిత్రీకరణ కూడా ఒక క్రమ పద్ధతిలో సాగిపోతుంది . ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా పాత్రధారులంతా చిన్న చిన్న వారితో సహా చక్కగా హావ భావాలు ఒలికించెస్తారు. పాండవులు పంపిన సత్య పీఠం ఈ రోజుల్లోని లై డిటెక్టరు ని అప్పుడే ఊహించి కథలో చొప్పించారు. 1957 లో ఈ సత్య పీఠాలు, మాల్ లు, ప్రియ దర్శిని లు లేవని అనుకుంటున్నాను. కానీ వాటి ఉనికి ని ఊహించి ప్రజా బాహుళ్యం లోకి తెచ్చారు. అప్పటి ప్రేక్షకులు వాటిని చూసి ఆశ్చర్య పోయి ఉంటారనుకుంటాను . ఇవన్నీ నిజంగా పుడతాయా అన్న సంశయం కూడా వాళ్లకు వచ్చి వుంటుంది .
some days back i have created the post, but today i am not able to view the telugu font button in the compose menu. any one please guide me to have it back in my menu...
meanwhile, enjoy the post as it is...
malladi lakshmana kumar

14, మే 2013, మంగళవారం
అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మనసింహధ్వజముగ్రాలచూడవలదే.....
నేడే చూడండి
బందరు శ్రీ దుర్గా మహల్ లో
మీ అభిమాన నటుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరు తారక రామారావు మరియు మీ అభిమాన తారాగణం సావిత్రి, అక్కినేని, రేలండి రమణారెడ్డి ఎస్ వీ రంగారావు మొదలగువారు నటించిన
మాయా బజార్
...........................
అసలు ఇక్కడే ఎందుకు చూడాలి? ఏం పెద్ద గొప్ప ఆ టాకీసు అని అంటారని నాకు తెలుసు!!!
మీరు వినలెదా... మచిలీపట్నం మాయాబజార్ మాటనీ కొస్తే లైనేసా ... అన్న పాట. ఇదేకాకుండా సుందరాకాండ సినిమాలో మచిలీపట్నపు మాట్నీ ఆటకు బాక్సులు నిన్డునులే అని ఇంకొన్ని తెలుగు పాటల్లో కూడా బందరు, మాయాబజారు ప్రస్తావన కనిపిస్తుంది.
మయా బజార్ విడుదలైన కొత్తల్లో దుర్గా మహల్ లో ప్రతిరోజూ పండగట అని పెద్దవాళ్ళు అంటుండగా విన్నాను. ఆంధ్రావని అంతటా తారక రాముడికి తెర ముందే నీరాజనాలు ఇచ్చేవారని ప్రతీతి. అప్పట్నుంచే ఇంతమంది గుండెల్లో చోటు చేసుకున్న ఈ సినీరాజాన్ని ఇప్పుడు యావత్ భారతానికే నచ్చిన మొదటి చలన చిత్రం గా మహా మహా సత్యజిత్, శ్యాం బెనగల్, గురుదత్, రాజ్ కపూర్, మృణాల్ సేన్ వంటి వారి చిత్రాలను తోసిరాజని, బెంగాలీ, హిందీ కావ్యాలని పక్కన పెట్టి, ఎన్నికవ్వటం మన ఆంధ్రులకి గర్వకారణం.
ఈ సినిమా గురించి బ్లాగ్లోకం లో చాలా మంది చాల రకాలుగా చెప్పెసుకున్నారు. మాయ శశిరేఖ పేరు పెట్టుకున్న బ్లాగరి ఆ. సౌమ్య గారు కూడా పలువురు మెచ్చగ ఇట్లా (మాయాబజార్ – పాండవులు లేని భారతం), ఇంకా భండారు శ్రీనివాసరావు గారు (http://bhandarusrinivasarao.blogspot.in/2013/05/blog-post_2772.html) రాసేసారు.
ఏమో, యెంత చెప్పినా యెంత వినినా తినగా తినగ వేము (ఇది వేము కాదండోయి, ప్రాస కోసం అని మనవి) ఇంకా తీయనగునని చూడగా చూడగా ఇంకొద్ది గొప్పతనం, వింత బయటపడుతుందని అనుకొని , తెలుసుకొని , మళ్ళీ ఇలా రాసే అవకాశం ఈ శుభ సందర్భంగా నాకు కలిగిన్ది.
ఏ రకం గా చూసినా, ఏ కోణాల్లో చూసినా, ఏ శాఖ లో వెతికినా తప్పు పట్టటానికి వీలులేని కళాఖండం "మన" మాయాబజారు . వింత కొలిపే మార్కస్ బార్లె ఛాయాగ్రహణం నలుపు తెలుపుల్లో ని వెన్నెల నీ, చందమామ నీ, హాయి గొలిపే చల్ల పిల్ల గాలినీ, ఆ గాలికి ఊయలలూగే పైరునీ కథానాయకుడు ప్రియురాలి సరాగాలనీ ఇంపుగా చిత్రించి చూపారు. పింగళి గారి మాటకారితనం గురించి చెప్పనలవి కాదు (నాకు , పైన పేర్కొన్న బ్లాగరి ఇప్పటికే చెప్పేశారు). వింతలూ భ్రాంతులూ విషయానికొస్తే అప్పుడెప్పుడో 1957 లోనే మన దృశ్య శ్రవణ పెట్టె ని అప్పటి వీక్షకులకు పరిచయం చేసారు రెడ్డి గారు. బిగ్గు బజార్లని, వన్ మాల్ నీ అప్పుడే ఊహించేసారు విడిది లో సృష్టించేసారు . అం ఆహా అంటూ గింబళి, గిల్పం సృష్టించేసారు. రథ చోదకుడు భళి భళి దేవా అని పాడినా, ఘటోత్కచుని శిష్యులు అల్లరి ఆగం చేసినా, అలమలాలు వీరతాళ్ళు అన్న కొత్త పదాలు కనిపెట్టినా , చిన మాయను పెను మాయ అని కృష్ణ పాత్రని ముసలి బ్రాహ్మడిగా చూపించినా ప్రేక్షకులకి వినోదిన్చారే గానీ విసుగు పుట్టలేదు చిత్ర నిడివి వల్ల కానీ తడవ తడవ కీ వచ్చే పాటల వాళ్ళ కానీ అలుపు వెయ్యలేదు. సావిత్రి ఆహ నా పెళ్ళంట అంటూ చూపిన నటన ఇంకా ఏ ఇతర నటీమణుల నటన లోనూ చూడలేము. తడబాటు సిగ్గు కలగలిపి నాట్యాన్ని జోడించి మధ్యలో మగతనపు భావ ప్రకటన చూపి కలగలిపిన ఆ సన్నివేశాలు చిత్రానికే మకుటాయమానం.
నటన లో జంట కవులవంటి నందమూరి అక్కినేని నటనా చాతుర్యం, రేలంగి, రమణారెడ్డి హాస్యం, ఘంటసాల, లీల, సుశీల, మాధవపెద్ది గళవిన్యాసమ్, పింగళి వారి పద విన్యాసం, ఘంటసాల వారి స్వరాలూ అన్నిటినీ మించి ఎస్వీ రంగారావు ఘతొత్కచీయమ్ .... వీటన్నిటికీ
చిత్ర నిర్మాణానికి పని చేసిన అందరికీ
వీరందరికీ రంగులద్దిన చిత్రకారులకీ
ఇంత అరుదైన చిత్రాన్ని ఇప్పటికీ ఆదరిస్తున్న ఆంధ్రు లందరికీ
ఎన్నిక కు కారకులైన అందరికీ
మాయాబజార్ సినిమా మొత్తం డైలాగులు,
పాటలు, పద్యాలు, వీలయితే నేపధ్యసంగీతం కూడా చెప్పేయగలను/పాడేయగలను/నోటితోనే
వాయించెయ్యగలను.- అని ధంకా బజాయించి చెప్పే బ్లాగు వీరుడు రవికిరణ్
గారికీ, ఇంకా ఆ.సౌమ్య
గారికీ
వివాహ భోజనంబు అంటూ ఇప్పటికీ మాధవపెద్ది గళమే వింటున్నామా అని అనిపించేలా పాడగల అభినవ మాధవపెద్ది సత్యం నా సహోద్యోగి చింతలపాటి సురేష్ ( చింతలపాటి సురేష్) గారికీ
చివరగా, అప్పటి కాలానుగుణ పరిస్తితులను బట్టీ సాహసం చేసి వింతలూ విశేషాలతో ఏర్చి కూర్చటమే కాకుండా వ్యాపారాత్మకం గా అలోచించి, ఈ చిత్రాన్ని రాసినా చూసినా సకల సౌభాగ్యాలు సంపదలూ కలుగుతాయని ఫలశ్రుతి చెప్పించిన కె వి రెడ్డి గారి ఆలోచనకు
వేసెయ్యండి వీరతాళ్ళు.
ఈ పద్యం ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను :
"అష్టదిక్కుంభికుంభాగ్రాలపై మన సింహ ధ్వజముగ్రాలచూడవలదే,
గగనపాతాళలోకాలలోని సమస్తభూతకోటులునాకెమ్రొక్కవలదే,
ఏదేశమైన, నా ఆదేశముద్రపడి సంభ్రమాశ్చర్యాలజరుగవలదే,
హై హై ఘటోత్కచ, జై హే ఘటోత్కచ అని దేవగురుడే కొండాడవలదే
యేనె ఈయుర్వినెల్ల సాశించవలదే,యేనె ఐశ్వర్యమెల్ల సాధించవలదే
యేనె మనబంధుహితులకు ఘనతలెల్ల కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే"
మరిక సెలవా ....
మల్లాది లక్ష్మణ కుమార్
31, మార్చి 2013, ఆదివారం
ఇంకొన్ని చక్రి కవితలు:
చడి చప్పుడు లేకుండా ఎప్పుడు ఎలా చేరి ఒదిగానో
ఆకలి తాపాలు వేధిస్తే వేగలేక తనువు మరచానో
తడబడుతూ పడిలేస్తూ అందుకే ఇలా ఎదిగానో
తెలివి తెచ్చుకు నిలువెత్తు తెర దిమ్పుకున్నానో
విధి మేర వింత కలబోత తలదాల్చుకున్నానో
మలి వేళన తెలిసి నిశ్చేష్టత అలము కుంటానో
కలత నిదుర లో కలలని అన్వయిస్తానో ?!!
* * *
నీ అస్థిత్వానికి అనంత సాక్షి నేను
నీ ఆగమనాభిలాషి ఆతిధ్యము నేను
నీ అనంత చెరగుల ఆధారమూ నేనే
నీ సవ్వడుల వెన్నంటి వచ్చేది నేనే
నీవు నన్ను చీల్చుకు రావాలి
నేను నిన్ను కమ్ముకు రావాలి
నా బాహువుల్లోనే నీవు ఆడుకోవాలి
నా కౌగిలిలో నీతో దోబూచులాడాలి
ప్చ్ కానీ నీవెంటే నేను కనుమరుగవ్వాలి
ఇది విరామరహిత విన్యాస కేళి
ద్రష్ట దృష్టుల నవరస జావళి
ఈ ఆనందమేనా దీపావళి !!
ఉగాది కి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని ఆశిస్తూ
16, జనవరి 2013, బుధవారం
చక్రి - కవితలు
కొత్త సంవత్సరం లో రాఖరఖాలుగా రాద్దామని అనుకున్నాను కానీ .... కాలేదు.
ప్రస్తుతానికి క్రింది కవిత, అదీ మా చక్రి రాసినది, చదివి ఆనందించండి.
ప్రతి క్షణం మనసుని కాంతిమయం చెయ్యాలి ట
కానీ మరుక్షణమే చీకటి అలుముకుంటుంది ట
ఎవరి బ్రతుకు పుటలకు వారే రంగులద్దాల ట
తమ చేతలతో తామే మాపుకుంటారు ట
గతమయ్యే రేపు, జ్ఞాపకమయి మరపుకొంటారు ట
వెను తిరిగి చూస్తే మసక బారిన వెలుగు రేఖలు ట
నలిగి వెలిసి వసి వాడిన రంగు పూ సోబగులు ట
ఆ నోట ఆ నోట అన్నారు ట విన్నారుట ట వింటారు ట!!
అవి వెలిగి రంగులిడినవో
నలిగి మసి నలుముకున్నవో
మౌన రాగాల మూగబోయినవో ?!!
పలు భావనల సమాహారం మా చక్రి కవితలు. నాకెంతో ఇష్టమైన కవితలు మీకు కూడా పరిచయం చేస్తున్నాను.
తరువాత తీరిగ్గా కలుద్దాం.
సెలవు.
మల్లాది లక్ష్మణ కుమార్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)