ఈ మధ్య మా టీవీ లో వచ్చే సంగీత సంబరాలు చూస్తున్నారా! క్రితం వారం జరిగిన పోటీలో ఒకరిని మించి ఒకరు పోటీపడి పడేసారు. విష్యం ఏమిటంటే, దానిలో ఒక గాయని పడిన రాగం లోని పాట.
"రాగం" అని మన తెలుగులో వచ్చిన చిత్రం(చలన) ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. "తాయే యశోద" పాట ఎంతమంది విన్నారు? పోనీ ఇప్పుడైనా చేతులు ఎత్తండి!!
సంగీతం మానవ జాతికి యెంత అవసరమో, "శిశుర్వేత్తి పశుర్వేత్తి ..." అని ఎందుకన్నారో, అన్ని బాధలు, అలజడులు సంగీతం తో ఎలా నయమవుతాయో, అసలు సంగీతం తో వైద్యం చెయ్యగలరా............ ఇన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం ఈ పాట. (మహా మహా గొప్ప విద్వాంసులు/పాటలు మనకి చాలా వున్నాయి. ఏదో ఈ పాట గురించి అనుకుంటున్నాం కదా అని ఈ వ్యాఖ్య, గమనించగలరు). ఆలాపన తో మొదలైన పాట గాయని గొంతుతో పాటు రాగాలు తీసే వాయులీనం, పాశ్చాత్య రాగాల /వాద్యాల మిశ్రమం (fusion) మననీ ఏదో లోకాలలోకి తీసుకుపోయి , విహరిమ్పచేసి అలరిస్తుంది.
ఒకప్పుడు "పాడుతా తీయగా" అన్న బాలు గారి కార్యక్రమం కోసం మధ్య మధ్య లో అయన చెప్పే పాటల తెర వెనుక కధలు గురించి, ఆ పాటల గురించి అయన వ్యాఖ్యానం, అయన చెప్పే తేట తెలుగు పద్యాల గురించి...... ఇలా చాలా వాటి గురించి చకోర పక్షుల్లాగా ఎదురు చూసే వాళ్ళం. తెలుగు పాట ఎన్ని రకాలు గా పురుడు పోసుకుందో, ఎన్ని వయ్యారాలు పోయిందో, ఎన్ని రంగుల కళలు కందో, గాయకులు ఆ కార్యక్రమం లో పాడే పాత.. ఆపాత మధురాలు విని పులకించిపోయే వాళ్ళం. ప్రస్తుతం బహుళ ప్రచారం కోసం ఈ మధ్య వచ్చే సంకర పాటలు (పాతకులు/పాటకులు/పాఠకులు క్షమించాలి! లెస్స పలికితివి వత్సా! అని అనే వాళ్ళుంటే ... ధన్యవాదాలు) అంటే అనీ కాదు, ఈ రోజుల్లో కూడా మంచి పాటలు వస్తున్నై. కాదని అనడంల్లేదు, కానీ ప్రేక్షకుల మనోరంజనం కోసం చేసే చోట మంచి పాటలు పాడాలి. ఒక రోజు పాల్గొన్న గాయకుడు కూడా ఈ రకమైన బాధ వెలిబుచ్చారు. అయన ఒక మంచి పాత పాట పాడగా, న్యాయ నిర్ణేత అడిగారు, అందరూ ప్రస్తుత కాలం పాటలు పాడగా నువ్వు ఇలా చేసావేమిటి అని. దాని కోసం టీవీ వారిని ప్రాధేయపడి పాడాను అని చెప్పాడు కూడా.
ఇన్ని ఇలా జరుగుతుండగా, కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖుడు శ్రీ కీరవాణి (పేరులో తెలుగుతనం చూసారా) తనకు నచ్చిన పాటలు పాడితేనే వస్తాను అని షరతు తో వచ్చానని చెప్పారు. ఇంతకీ ఆ పాటలు ఏమిటో తెలుసా.. అలనాటి మల్లేశ్వరి లోని 'ఎందుకే నీకింత తొందర ..' , మరొక ఎప్పుడు వినని ఆణిముత్యం లాంటి పాట, ఆయనకి మన పాత మూలాలు మీద పట్టు వుండటం తోనే, తన పాటలు అంత శ్రావ్యం గా ఉంటాయి. కులుకుల కీరవాణి అని నేను సేకరించి పదిలపరచిన అయన పాటల గుచ్చానికి పేరు పెట్టుకున్నాను.
మరి ఏవీ ఆ పాత మధురాలు. ఏవీ ఆ మధుర మధురోహల సొబగులు. వింత దరువుల, వింత గొంతుకల, వింత విన్యాసాల పాటలు ఈ గాయకులూ పాడటం, వహ సెహబాస్ అని ఇతరులు పొగడటం, ఆకాశానికి ఎత్తే యటం .. నాకు మాత్రం నచ్చలేదు. మీరు ఎమనుకోపోతే ఈ మధ్య వచ్చిన రెహమాన్ రేహమేనియా కూడా అంత వినసోమ్పోగా లేదు. (మణిరత్నం మాయాజాలం మరుగైనట్లుగా..)
దయచేసి మన పురాతన నిధి ని పదిలంగా ఉంచండి, పదిమందికీ వినిపిమ్పచేయండి, ఆహ్లాదం కలిగించేలా అనుభవించండి, ఆ అనుభూతిని రోజంతా పదిలపరుచుకోండి.
మీ
మల్లాది లక్ష్మణ కుమార్
కాకుల సంగీత కచేరీలకు వెళితే లేదా చూస్తే ఇలాంటి మనో వేదనే మిగులుతుంది
రిప్లయితొలగించండిhaha..........endukandi criticize chestaaru........
రిప్లయితొలగించండిmeeku nachhina paatala list ivvandi memu vini baagunte anandistam.
ఇంత ఆవేదన పడిన మీరు మా టీవీలో వస్తున్న "నాదవినోదం" కార్యక్రమాన్ని ప్రస్తావిస్తే బావుండేది కదూ!
రిప్లయితొలగించండిఏమీ అనుకోనంటే,అసందర్భం అనుకోనంటే ఒక మాట. కీరవాణి గారి సంగీతం బాగానే ఉంటుంది, వారి పేరుతో తెలుగుతనమూ బాగానే ఉంటుంది.వారి ట్యూన్లు ఇంగ్లీషు వీడియోల నుంచి ఎత్తుకురావడమే బావుండదు. ఈ కింది లింకు చూడండి.
http://bhuvanavijayam.wordpress.com/2008/07/01/%E0%B0%85%E0%B0%97%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B2%E0%B0%A8-%E0%B0%9B%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A4%E0%B0%BF/