ఆడు మగాడ్రా ........
అట్లా ఎట్ట కొట్టాడురా ... ఏదో కొమ్మకి అంటు కట్టినట్టు, పద్దతిగా, శ్రద్దగా కొట్టాడురా ....
నిజంగా ఆడు మగాడురా ...
ప్రతినాయకుడిగా భరణి పలికిన మాటలు ఇవి "అతడు" లో
ఇప్పుడే "మాయాబజార్" చిత్రం చూసినాక నాకు గుర్తొచ్చిన మాటలు ఇవి. నిజంగా, ఆయన దర్శకుడు అంటే . ఒక పద్దతిగా కావ్యాన్ని రాసినట్టు ఒక దివ్యమైన శిల్పం చెక్కినట్టు మంచి బొమ్మ గీసినట్టు మొదట్నుంచీ చివరివరకు లేవకుండా చూసినాక ఈ సినిమా భారత దేశాన్ని ఎందుకు మెప్పించి ఒప్పించి ఈ వందేళ్ళ భారత సినిమా చరిత్ర లో అత్యంత అధ్బుత చిత్రం గాఆదరణ పొందిందో మళ్ళీ తెలిసిన్ది.
మొదలుపెట్టటం తోనే "చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా... " అని సమర్త పాట పెట్టటం ఆ రోజుల్లోనే మహిళా ప్రేక్షకుల నాడి పట్టేశారు. ఈ రొజులలో సినిమా చూడాలంటే ఇదు నిముషాలు ఆగి వెడితే పేర్లు అయిపోయి కథ మొదలవుతుందని అనుకునేవాళ్లు గానీ, ఈ పాట తో మహిళా ప్రేక్షకులు విజయ వారి జెండా నుంచి అన్నీ వదిలిపెట్టకుండా చూడాలనుకుని ఉంటారేమో. తెర మీది పాత్రల పరిచయం కూడా ఆ పాట తో అయిపోతుంది . కథ, చిత్రీకరణ కూడా ఒక క్రమ పద్ధతిలో సాగిపోతుంది . ఎక్కడా ఎక్కువ తక్కువలు కాకుండా పాత్రధారులంతా చిన్న చిన్న వారితో సహా చక్కగా హావ భావాలు ఒలికించెస్తారు. పాండవులు పంపిన సత్య పీఠం ఈ రోజుల్లోని లై డిటెక్టరు ని అప్పుడే ఊహించి కథలో చొప్పించారు. 1957 లో ఈ సత్య పీఠాలు, మాల్ లు, ప్రియ దర్శిని లు లేవని అనుకుంటున్నాను. కానీ వాటి ఉనికి ని ఊహించి ప్రజా బాహుళ్యం లోకి తెచ్చారు. అప్పటి ప్రేక్షకులు వాటిని చూసి ఆశ్చర్య పోయి ఉంటారనుకుంటాను . ఇవన్నీ నిజంగా పుడతాయా అన్న సంశయం కూడా వాళ్లకు వచ్చి వుంటుంది .
some days back i have created the post, but today i am not able to view the telugu font button in the compose menu. any one please guide me to have it back in my menu...
meanwhile, enjoy the post as it is...
malladi lakshmana kumar