క్రితం కబుర్లలో రాసినట్లు మా శ్రీరామ చంద్ర చక్రవర్తి సమయానుకూలంగా తెలియచేసే స్పందనలను మీకందరికీ పంచాలని అనుకుంటున్నాను, ఇక చిత్తగించండి !!!
""మందార మకరంద మాధుర్యమునదేలు మధుపమ్ము ఓవునే మదనములకూ !
నిర్మల మందాకినీ వీచికలదూగు రాయంచ చనునే తరంగిణులకు !
లలితా రసాల పల్లవఖాదియై చొక్కు కోయిల చేరునే కుతజములకూ !
పూర్ణేందు చంద్రికా స్ఫ్హురిత చకోరకమ్ము అరుగునే సాంద్ర నీహారములకు !
అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష మత్త చిత్తము
ఏ రీతి ఇతరమ్ము జేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా ?!!
శ్రీమన్నారాయణుని పట్ల భక్తి ఎంత ప్రియమైనదో !! తెలుగు లో మాత్రమే ఆ అనుభూతి ని అంతే హృద్యంగా పొందగలమని పోతన వారి పద్యమే చెపుతుంది !! అంత తీయనైన తెలుగులో స్వీయ భావాలు, అనుభవాలు, అనుభూతులు, ఆలోచనలు పంచుకోవటం విశేష ప్రయత్నమే !! ఈ అంతర్జాల వీధి సోది సుమాలలో మా లక్ష్మణుడి బంతిపూలు విలక్షణంగా విరబూస్తూ ఉంటాయని ఆశిస్తున్నాను !! క్రొత్త పూత కోసం చూస్తూవుంటాను""
మీ అందరికీ మా నిత్య శుభాకాంక్షలు !!