ఈ మధ్య ఆకాశం లో కొత్త రంగులు చూస్తూ కెమెరా లో బంధిస్తుండగా తీసిన ఒక వింత కొలిపే చిత్రం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటె దానిలో ఆకాశం లో ఎగురుతున్న వీర హనుమాన్ ఒక చేతిలో గద మరొక చేయి గాలిలో చాపి వెడుతున్న రకం గా స్పష్టం గా కనిపిస్తోంది. దీనిని చూపి ఇదేదో భగవంతుని మాయ, ఆంజనేయుడు గాలిలో వెలిసాడు అని నేను చెప్పదలుచుకోలేదు గానీ, ఇదొక ఆశ్చర్యమైన చిత్రం గా అనిపించి మీ ముందు ఉంచాను. మేఘాల వింత సోయగం ప్రతి క్షణం విచిత్రం గా మారుతూండడం రక రకాల అనుభూతుల్ని అందించటం, ఆకారాల్ని దాల్చటం ప్రక్రుతి వింతయే కదా. దయచేసి గమనించండి, ఇది నేను సృష్టించినది కాదు, సొల్లు ఫోన్ లో సహజం గా తీసిన ఆకాశ చిత్రం.
ఆ చిత్రం మీరూ చూడండి:
మరిన్ని ఆకాశ చిత్రాలను ఈ లంకె పై చూడగలరు: ఆకాశ చిత్రాలు (రంగుల ప్రపంచం)
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది
అభ్యర్ధన: మీరు నా అభిమానుల జాబితా లో చేరనే లేదు. దయచేసి మీ పేరు కుడిప్రక్క గల అనుసరించు వారి జాబితా డబ్బా లో నమోదు చేసుకో గలరు. చేసిన వారికి ధన్యవాదాలు.
chaalaahakkani drushyam
రిప్లయితొలగించండిమీ ఊహ చాలా బావుంది...నిజంగా ఎగురుతున్న ఆంజనేయుడిలాగే ఉంది. చాలాసార్లు ఈ మబ్బులు బలే విచిత్రంగా వింత వింత ఊహలని కలిగిస్తుంటాయి...ఆస్వాదించాలేగానీ అదొక మంచి అనుభూతి!
రిప్లయితొలగించండిchudalegane chuttuta adbutale
రిప్లయితొలగించండి