31, మార్చి 2011, గురువారం

మీకు ఒక బ్రహ్మానంద భరితమయిన సన్నివేశం చూపిన్చదలుచుకున్నాను. ఈ క్రింది చిత్రం చూడండి:

చిక్కాడు చేతిలో బావ  
ఒకాయన వేరొక యువకుని చేతిలో గోరింటాకు దిద్దుతున్నాడు. ఆ సన్నివేశం ముగ్గురూ ఆస్వాదిస్తున్నారు, ఆ భావాన్ని మొహం లో చూపిస్తూ.

విష్యం ఏమిటంటే, కుడి పక్కనున్న శంకరానికి ఇటీవలే పెళ్లి జరిగింది. ఆ హడావిడిలో బావ సుబ్రహ్మణ్యం (ఎడమ) ఇతని చేతిలో సరదాగా....  ఇలా గోరింటాకు పెడుతూ మూడో కంటికి చిక్కాడు. వెనక చిరునవ్వులు చిందించే ఆయన ఇంకొక బావ, అయన పేరు కూడా సుబ్రమణ్యం , కాకపోతే ఘనాపాటి గారు.

ఈ సన్నివేశం లో వీళ్ళ మోముపై చూపించిన బ్రహ్మానంద భరితమైన భావాలు నాకు బాగా నచ్చి ఈ చిత్రాన్ని మీ వరకు తీసుకొచ్చాయి.


ఈ చిత్రానికి మీ వ్యాక్యాలు హాస్యభరితం గా తెలియచేయండి. ఈ పెళ్ళికొడుకు కు కానుకగా నేనన్దిస్తాను.

ఉంటాను
లక్ష్మణ కుమార్ మల్లాది.

2 కామెంట్‌లు:

  1. సుబ్రమణ్యం: ఏంటి బావా! పెళ్ళి కొడుకు ఇంత సింపిల్ గా వుంటే ఎలా? పాత సినిమాలో
    ఎన్.టీ.ఆర్ లా వున్నావు.. ఉండు నీ అరచేతికి గోరింటాకు పెడతాను..
    శంకర్: ఊర్కోరా.. నేనేమన్నా పెళ్ళికూతుర్నా గోరింటాకు పెట్టించుకోడానికి..
    సుబ్రమణ్యం: నువ్వు ఓ యాభై ఏళ్ళ క్రితం ముందు పుట్టాల్సినోడివి.. ఈ రోజుల్లో మగాళ్ళు
    కూడా చేతినిండా ఈ లేటెస్ట్ గోరింటాకు (ఆల్టా) దిద్దుకుంటున్నారోయ్..
    వెనకాయన: పెట్టించుకోరా! నీ చేతిలో గోరింటాకు ఎంత బాగా పండితే నువ్వు నీ భార్యని
    అంతగా ప్రేమిస్తున్నట్టు లెక్క.. ఫస్ట్ నైట్ లో నీ చేతులు చూసి నీకు తన పైన ఎంత
    ప్రేముందో తెలుసుకుని మా చెల్లెలు మురిసిపోతుందోయ్..
    శంకర్: ఈ గోరింటలో ఇంత లాజిక్కుందా? సరే కానీ..(అంటూ చెయ్యిని బావమరిది చేతిలో
    పెట్టాడు)

    మొత్తానికి చిక్కాడు మా బావ అని ఇద్దరు సుబ్రమణ్యంలు సరదాగా నవ్వుతుంటే, వారితో బాటు శంకరమూ జత కలిపాడు..ఈ బావా మరుదుల వినోదాన్ని మూడో కంటి వారు చమక్కు మంటూ క్లిక్ చేసి, ఇలా మనకందరికీ కనువిందు చేసారు..

    రిప్లయితొలగించండి
  2. @ voleti
    వొలెటి గారికి నమస్కారం. చాలా బాగా వెంటనే స్పందించారు. ధన్యవాదములు.మీ చమత్కారం వెంటనే పెళ్ళికొడుకు కు చేరిపొయింది.

    రిప్లయితొలగించండి