బాపు రమణ ల గారి గురించి ఎంత చెప్పినా తరగదు ! మన తెలుగు సినిమా చరిత్ర లో ఈ రకమైన మహానుభావులు చాల మంది ఉన్నారని మీకు తెలుసు కదా. ఉదాహరణకి, విశ్వనాధ్, వంశి, బాపు, సిరివెన్నెల,ఘంటసాల, సుశీల, బాలు, జానకి,............ అలాఆఆఆఆఆఅ
ఇంతకీ నేనేం చెప్పోచ్చాను చెప్మా?? శ్రీరమణ గారి కథలు "మిధునం" చదివారా మీరు? ఆ పాత్రోచిత సంభాషణలు, పాత్రాభినయం (ఇలా ఎందుకన్నానంటే ప్రతి పాత్ర అభినయం తో సహా మనకి కనిపిస్తుంది) మలిచిన తీరు .... వహ్వా రే వహ్వా...మొదటి కధ అరటి పువ్వుల వడల గురించి.. . స్వామీజీ వాటి గురించి చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకుంటూ వస్తారు ! వడల తయారీ తో నిబిడిఉన్న అంతర్లీన తాత్వికత ని హాస్యోక్తం గా చెప్పటం తోపాటు, ఏ దేముడి దగ్గర ఆ భజన చేసినట్టుగా సందర్బోచితం గా ఆ వర్ణనలని మార్చుకుంటూ వస్తారు. చివరగా వేచిఉన్న భక్తురాలు ఆ ధోరణి కి మురిసిపోయి "మీ పాదాల చెంత చోటిస్తే మీ జీవిత చరిత్రను గ్రంధస్తం చేస్తూ, అరటి పువ్వుల వడలను వండిపెదతాను" అనిపించటంలో చమత్కారం కాలానుగుణం గా అనిపిస్తుంది.
వరహాల బావి, ధన లక్ష్మి కధ, మినిస్టర్ గారి అమ్మాయి పెళ్లి ఇత్యాదులన్నీ మత సామరస్యానికీ, సమకాలీన పరిస్తితుల గురించి కోమట్ల వ్యాపార శైలి ని హాస్యోక్తం గా తెలియచేస్తాయి. బంగారు మురుగు కధ నేనెప్పుడూ చెప్పే బ్రాహ్మణ వ్యావహారిక శైలి సంభాషణలతో నవ్వు తెప్పిస్తాయి. మనవడ్నేసుకుని బామ్మ గారు కధ నడిపే తీరు ... చదవాలే గాని చెప్పనలవి కాదు. వాడికి పున్జీల కొద్దీ జీళ్ళు, పీచ్మిటాయి లూ (కంచు గంటను అమ్మేసి మరీ) కొనిపెట్టటం, బాదాం చెట్టు తొర్ర లో తినుబండారాల బ్యాంకు పెట్టటం, ... "నాకు అరేల్లప్పుడు మా బామ్మ కి అరవై ఏళ్ళు. మా నాన్న అమ్మ ఎప్పుడూ పూజలు, పునస్కారాలు, మళ్ళు దేవుళ్ళు గొడవల్లో వుండేవాళ్ళు. స్వాములార్లు, పీటధిపతులు - ఎత్తే పల్లకి దించే పల్లకి తో మా ఇల్లు మఠం లా ఉండేది.అమ్మ తడి చీర కట్టుకుని పీటాల్ని సేవిస్తూ - నీ దగ్గరికి వెడితే తాకకోడదు అనేది."" ఇలా మొదలవుతుంది కధ.
అసలు బామ్మ గారి కాన్సెప్ట్ "దయ కంటే పుణ్యం లేదు. నిర్దయ కంటే పాపం లేదు.చెట్టుకి చెంబెడు నీళ్ళు పొయ్యటం, పక్షి కి గుప్పెడు గింజలు వెయ్యటం, పశువు కి నాలుగు పరకలు వెయ్యటం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టటం - నాకు తెలిసిన్దివే..." మహా గొప్ప గా ఉంది కదూ.
మీరు ఈ లంకె లోకి వెల్లి పూర్తి కధ చదవండి, సరళమైన ప్రక్రియతో ఆ లంకె లో సభ్యత్వం పొందచ్చు.
http://www.scribd.com/doc/7430162/Bangaru-Murugu-Part1
మిగిలిన కధ గురించి తరువాత రాస్తాను.
మీ లక్ష్మణ్ కుమార్ మల్లాది
(చెప్పుకోటాని మనకు చాలా చాలా గొప్ప కథకులు ఉన్నారు, నేను చదివినవి - శ్రీపాద, మల్లాది రామకృష్ణ శాస్త్రి, తిలక్, చాసో, మధురాంతకం, రమణ, వంశి, యుండమూరి, భానుమతి అత్తగారి కథలు, భమిడిపాటి, ఇలా చాలా ఉన్నాయ్. గుర్తుకొచ్చిన కొద్ది వాటిని మీకు వీలు చూసుకొని పరిచయం చేస్తాను, మీకు తెలియదని కాదు!! ఏదో నా చాదస్తం గొద్ది... ఎందుకంటె నేను ఒకసారి చదివి వాటిని వదిలిపెట్టను!! తెలుగు మట్టి వాసన మరచి పోయినపుడల్లా మళ్ళీ మళ్ళీ వాటిని అనుభవిస్తూ అస్వాదిస్తూంటాను. అందుకని మిగిలిన గొప్ప రచయితల గురించి ప్రస్తావిన్చాదేంటి అని అనుకోకండి, సరేనా )