ఈ మధ్య బ్లాగుల్లో చూసి నేర్చుకున్న విష్యం ఏమిటంటే మనకి నచ్చిన పాటలను మీకు బ్లాగ్ముఖంగా వినిపించవచ్చును అని. ఈ విషయమై ఒక బ్లాగరు ను సంప్రదించగా వారు ఇచ్చిన సలహా మేరకు నాకు మొదటగా నచ్చిన ఒక పాట ను మీకు వినిపించ దలుచుకున్నాను. అసలు మొదటిసారిగా నేను ఇంతకు ముందు పుటలలో చెప్పిన ఆకాశవాణి వారి "రాజరాజేశ్వరీ మంత్ర మాతృకా స్తవం" మల్లిక్ గారి స్వరం లో వినిపించుదామని అనుకున్నాను. ఆకాశవాణి నుంచి ఆ రికార్డు కూడా కొన్నాను. కానీ అవి ఆకాశవాణి వారి ఆంతరంగిక రక్షణ (rights protected ) చే రక్షించబడటం వలన embaded సూత్రం జనించక (ఆ స్తోత్ర రాజాన్ని మీరు ఈ లంకె ద్వారా పొంది వినవచ్చు: స్తోత్రం ) ఆ ప్రయోగం మానుకుని, మన ఘంటసాల గారి ఆ పాత మధురాల లో నుంచి 'రసికరాజ తగువారము కామా .....' అన్న జయభేరి చిత్రం లోని ఒక పాట రాజాన్ని నా మొదటి ప్రాధాన్యతా క్రమ పట్టిక నుంచి బయటకు తీసి రికార్డు వేస్తున్నాను. విని ఆనందించండి. ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ పాత గురించి ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు అని అనుకుంటున్నాను.
పేరు పొందిన వేదికల మీదనుంచి రకరకాల గాయకులూ ఈ పాట ను పాడటానికి ప్రయత్నించగా చాలా సార్లు నేను విన్నాను. కానీ, అసలు ఉన్నంతగా కొసరు ఉండక, అంత రుచి రాలేదు. ఒక పోటీ లో మన 'శ్రీరామచంద్ర', అదేనండీ సోనీ వారి గాయక సామ్రాట్, అలవోకగా ఘంటసాల లెవెల్లో అతి మధురం గా గానం చేసాడు. ఆ పోటీలో నెగ్గక పోయినా రచ్చ గెలిచి ఇంటికి తిరిగి వచ్చాడు. సాంప్రదాయక సంగీత బాణీ లో ఉన్న ఈ పాట ను మీరు తప్పక ఇష్ట పడతారని ఆశిస్తూ...
ఒక్క క్షణం ఆగండి... ఏమండీ! ప్రక్కన నేను కొత్తగా చేర్చిన సభ్యుల జాబితా చూసారా, ఎవరూ సభ్యులు లేక నేనే మొదటి వాణ్ని అవ్వాల్సి వచ్చింది. మీకు ఏ మాత్రమైనా నా కబుర్లు నచ్చినా నా బ్లాగు ను అనుసరిస్తూ, సభ్యులు గా చేరి నాను ఆదరించగలరు. సరేనా!!!
మరిక సెలవా మరి...
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి