ఈ రోజు మీకు ఒక అజ్ఞాత కవిని పరిచయం చేస్తున్నాను. ఇప్పటివరకు తన కవితలు నాకు తెలిసి చీకటిలోనే ఉండిపోయాయి. అతని అనుమతి లేకుండా నేను మీకు ఇవి అందిస్తున్నాను! అసలు ప్రతి నాదగ్గరే ఉన్నది కనుక నేమో నాకు ఈ ధైర్యం?! "అజ్ఞాత కవి" అన్న శీర్షిక కింద మీరు వాటిని నా పుటలో చూడవచ్చు. మీ స్పందనలు నేరుగా అతనికే తెలియచేయండి.... chakri5@yahoo.com అన్న చిరునామా కి..
దయచేసి గమనించ గలరు. ఈ కవితలు నా సొంత రచన కాదు.
నీవు రాలేదు !
వేచి వాలిన కనుల
చీకటి అలుముకుంది!
పరువాల కలువ
అలిగి ముడుచుకుంది!
విరిపూల వన్నె
ఎదురుచూపులో వాసి వాడినదేమో?
చెక్కిట జారిన ముత్యం
మునిపంట బిగిసిన పెదవి అదురుకు
ఝాడుసుకుంది
నిట్టూర్పు సెగలు నిండిపోయిన ఎద
సోలిపోయింది!
తను వాలిపోయింది!
రేయి మలుపు చూసుకుంది!
నీవు రాలేదు!!!
రచయిత చక్రి కి ధన్యవాదాలు మరియు క్షమాపణల తో ....
మీ
మల్లాది లక్ష్మణ కుమార్
దయచేసి గమనించ గలరు. ఈ కవితలు నా సొంత రచన కాదు.
నీవు రాలేదు !
వేచి వాలిన కనుల
చీకటి అలుముకుంది!
పరువాల కలువ
అలిగి ముడుచుకుంది!
విరిపూల వన్నె
ఎదురుచూపులో వాసి వాడినదేమో?
చెక్కిట జారిన ముత్యం
మునిపంట బిగిసిన పెదవి అదురుకు
ఝాడుసుకుంది
నిట్టూర్పు సెగలు నిండిపోయిన ఎద
సోలిపోయింది!
తను వాలిపోయింది!
రేయి మలుపు చూసుకుంది!
నీవు రాలేదు!!!
రచయిత చక్రి కి ధన్యవాదాలు మరియు క్షమాపణల తో ....
మీ
మల్లాది లక్ష్మణ కుమార్
పేరు వూరు తెలిసాక, ఇంకెక్కడి అజ్ఞాతం(నం) ?!!
రిప్లయితొలగించండిఆంగ్ల నూతన వత్సర శుభ కామనలతో
-జ్ఞాత వ్యక్తి