మా చక్రి సంక్రాంతి శుభవేళ కొత్త సందేశం ఇచ్చాడు. మరిక అదేమిటో చిత్తగించండి:
* * *
నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు
ఆనాటి కానాటి
సామ్రాజ్యాలు సామ్రాట్టులు మటుమాయమయ్యే
రాజ్యాలు రాజులు పోయి రాతి గురుతులు మిగిలే
నవాబులు పటేళ్ళు తెరమరుగాయే
కామందులు కరణాలు కనుమరుగాయె
ఘోర కలికల్మషములు కాలగర్భము చేరె !
నాటికి నేటికి తెలుగు వెలుగుజూడ
పాంచ వేద మది నన్నయ్య తెనిగించు
రామాయణమున్ తిక్కన నిర్వచించు
సిరికిన్ జెప్పడంటూ శ్రీనాధు వర్ణించు
మందార మకరందమనుచు పోతన ప్రార్ధించు
సత్య భామనే యనుచు సిద్దేంద్రు నర్తించు
శ్రీరాము దయ చేతననుచు బద్దెన పలికించు
విశ్వదాభిరామయన్చు వేమన బోధించు
అదివో అల్లదివో అనుచు అన్నమయ్య మ్రొక్కించు
లెస్స లెస్సయని శ్రీకృష్ణరాయ శ్లాఘించు
పలుకే బంగారమాయెనా యనుచు గోపన్న లాలించు
ఎందఱో మహానుభావులన్చు త్యాగయ్య కీర్తించు
ఎల్లలెరుగని నీ విదుల భావమ్ముల మేలుగని నీ
సంక్రాంతికిన్ విశాలాంధ్రసుతుల్ సుఖమునొందు గాక
వేర్పాట్లు మరచి !!
(--భావము తప్ప వ్యాకరణ దోషములు గ్రహించ వలదని మనవి ) అని చక్రి తెలియచేసారు.
* * *
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది.
* * *
నవ సంక్రాంతి వేళ శుభ శాంతి కామనలు
ఆనాటి కానాటి
సామ్రాజ్యాలు సామ్రాట్టులు మటుమాయమయ్యే
రాజ్యాలు రాజులు పోయి రాతి గురుతులు మిగిలే
నవాబులు పటేళ్ళు తెరమరుగాయే
కామందులు కరణాలు కనుమరుగాయె
ఘోర కలికల్మషములు కాలగర్భము చేరె !
నాటికి నేటికి తెలుగు వెలుగుజూడ
పాంచ వేద మది నన్నయ్య తెనిగించు
రామాయణమున్ తిక్కన నిర్వచించు
సిరికిన్ జెప్పడంటూ శ్రీనాధు వర్ణించు
మందార మకరందమనుచు పోతన ప్రార్ధించు
సత్య భామనే యనుచు సిద్దేంద్రు నర్తించు
శ్రీరాము దయ చేతననుచు బద్దెన పలికించు
విశ్వదాభిరామయన్చు వేమన బోధించు
అదివో అల్లదివో అనుచు అన్నమయ్య మ్రొక్కించు
లెస్స లెస్సయని శ్రీకృష్ణరాయ శ్లాఘించు
పలుకే బంగారమాయెనా యనుచు గోపన్న లాలించు
ఎందఱో మహానుభావులన్చు త్యాగయ్య కీర్తించు
ఎల్లలెరుగని నీ విదుల భావమ్ముల మేలుగని నీ
సంక్రాంతికిన్ విశాలాంధ్రసుతుల్ సుఖమునొందు గాక
వేర్పాట్లు మరచి !!
(--భావము తప్ప వ్యాకరణ దోషములు గ్రహించ వలదని మనవి ) అని చక్రి తెలియచేసారు.
* * *
మన తెలుగు వెలుగులు ఎల్లెడలా వ్యాపింప చేయు ఇటువంటి కీర్తనలే మనకు రక్ష. కావున దయచేసి మన భాషను విడదీయకండి. కిన్చపరచకండి. అభిమానించండి. సొగసును ఆస్వాదించండి.
ప్రాంతం ఏదైనా, కులం ఏదైనా, మతం ఏదైనా, యాస ఏదైనా...
"జై తెలుగు" అనండి. తెలుగు తల్లికి నివాళు లివ్వండి.
మీ
లక్ష్మణ కుమార్ మల్లాది.
(మీ అభిప్రాయాలను ప్రచురించటం మరచిపోకండి)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి