మా గొండా జీవితం లొ మరొక మరిచిపొలేని జ్ఞాపకం ఇది. చలి కాలం లొ సరదాగా ఉదయాన్నె లెచి మిత్రులు శివ ప్రసాదు, రమెష్ లతొ ఉదయం నడకకి వెళ్ళే వాళ్ళం. అలా ఊరి బయటి దాకా వెల్లి ఒక ఘంట సేపు తిరిగొచ్చె వాళ్ళం. ఉదయన్నె కటిక మంచు (కటిక చీకటి లాగా, అంటే దట్టమైనది అని అనుకొండి ) లొ ప్రకృతిని చూస్తూ అస్వాదిస్తూ చల్లదనాన్ని గొంతు నిండా నింపు కుంటూ , (తరువాత జలుబు వలన నానా ఇక్కట్లు వచ్చెవనుకొండి) కబుర్లు చెప్పుకుంటూ వెడితే యెం మజా గా ఉందెదొ...
ఒక రొజు మంచు తెరల మాటున మన శివుడు ఒక అద్భుతాన్ని చూసాడు: యెమిటంటారా...
ఒక తొట... మన అంధ్రులకు ఎంతగానొ ప్రియమైన శాకం, మాయాబజార్ లొ కూడ "శాకంబరీ దేవి వర ప్రసాదం,ఆంధ్రుల వంట.. అది లేకుండా ప్రభువులు ముద్దైనా ముట్టరు" అని అనిపించుకున్న మన గొంగూర.
అక్కడ వున్న రొజుల్లొ రమారమి సంవత్సరానికి ఒక్క సారి మాత్రమే మన అంధ్రా కేసి వచ్చె వాళ్ళం. ఇష్టం అని పచ్చళ్ళు యెంత పట్టికెల్లినా రెండు నెలల లొపే తాజా దనం పొయి అరుచి కలిగెది. తాజా గా చేసుకుందాం అంటె దొరకని స్థితి. ములక్కాడలూ అంతే, అస్సలు దొరికెవి కాదు. ఒక రొజు బజారులొ కనిపించాయి అంటె ఇహ మనవాళ్ళందరికీ చెప్పి తొలుకెళ్ళెవాళ్ళం. అవీ చాలా లేతగా 5 లెక 6 అంగుళాల సైజులొ దొరికేవి.
ఈ తాయిలం కనిపెట్టిన శివ ప్రసాదు, వాళ్ళావిడ తొ చెప్పేసాడు , మేము ఒక ఖజానా ని చూసామని. ఇంకెముంది, జనాలంతా పెళ్ళాలని, వచ్చిన వాళ్ళు పిల్లలని వెంటేసుకుని ఒక ఉదయం ఆ గొంగూర చెను మీద పడ్డాము. కల్లు తాగిన కొతి వనమంతా చెరిచిందనీ... వానరులు కిష్కింధ వనం అంతా నేల మట్టం చెసినట్టుగా.. అసలె వాళ్ళు నారు కొసం పెంచినట్టున్నారు, అవి గొంగూర వ్రుక్షాలయినాయి. ఆ వ్రుక్షాలన్నీ మోడు చెసి, విరక్కొట్టి, కొసుకున్న వాళ్ళు కొసుకున్నంత తెచ్చెసుకున్నారు. దాంతొ పులుసె పెట్టుకొ, పచ్చడె చెసుకొ, పప్పె వండుకొ, ఉన్నన్నళ్ళూ వారం పది రొజుల పాటూ గొంగూర సంతర్పణ చెసుకున్నాం.
నేనుకూడాఈ వానరుల్లొ ప్రముఖుడినే అని చెప్పటానికి మిక్కిలి సంతొషిస్తూ, ఎండ మావుల్లొ నీటి చెలమ లాగ మాకు ఆ వనాన్ని తెలియ కుండా అంకితం చెసిన అజ్నాతుడికి ధన్యవాదాలు చెపుతూ...
ఇంకొ విషయమండోయి , ఈ కొతి పనికి అలవాటు పడి కొన్ని రొజుల తరువాత వెల్లిన మాకు చుక్కెదురైంది. యెవరొ కాపలా మనిషి తిట్టినంత పని చేయటం తొ అటుకేసి వెళ్ళటం మానుకున్నాం.
ఈ కిచ కిచలు మీకు నచ్చినట్లయితే, మీ అభిప్రాయాలు వ్యాఖ్యలలొ తెలియ చేయండి.
మీ
మల్లాది లక్ష్మణ కుమార్
బాగుందండి!
రిప్లయితొలగించండి