ఎవరొ ఒకరు
ఎపుడో అపుడు
ఎపుడో అపుడు
ప్రజల కోసం... ప్రజా సమరం... ప్రజా విజయం
అవినీతిని అంతమొందించటానికి, భ్రష్తాచారాన్ని తుదముట్టించడానికి ఉద్యమించిన ఒక సామాన్యుడు ప్రజల మద్దతుతో, ఏ రాజకీయ కొణం లేకుండా, దేశమంతా వెల్లువెత్తిన ప్రజాభిమానం తొ సాధించిన తీరు ... అభినందనీయం.
ఇది ఒక అంకురం. ఆ చిగురుని ఆదిలొనే ఎండకట్టకుండా వ్రుక్షాన్ని చేయవలసిన బాధ్యత మేధావులు, యువత, ప్రజ, మనందరిమీదా ఉంది.
చిత్రమేమిటంటె, ఇన్ని సంవత్సరాల నించి ఆ బిల్లు అమోదం పొందకుండా చేసిన రాజకీయ పార్టీలు, నేతలు (ఇలా అని ఎందుకనాలంటె, పార్లమెంటులొ ఒటు వేసెది అమోదింపచేసేది వారే కాబట్టి), ఇపుడు టీవీ లొ చేసే ప్రకటనలు, వ్యాఖ్యలు నవ్వు తెప్పిస్తాయి, వారికసలు సిగ్గె లెదా అని అనిపిస్తుంది. ఒక ఎన్నికల పోటిదారుదంటాడు .. "ఈ స్ఫూర్తి తొ అవతల పార్టీ వారు చేసే నొట్ల పంపకం, అవినీతి అడ్డుకుంటానని". మరి ఇప్పటిదాకా ఈయనెం చెసాడో. జనాలు నవ్వుతారని కూడా చూడకుండా , ఈ చైతన్యాన్ని కూడా ఒట్ల కోసరం వాడుకుందామని ఆయన యత్నం.
ఈ విజయ ప్రకటన వచ్చిన సమయం లొ ఒక టీవీ చర్చా కార్యక్రమం లొ పాల్గొన్ననేత ఒకామె(టైంస్ నౌ చానెల్ లొ, పేరు మీనాక్షి రెడ్డి) ముఖం లొ భావమేమీ లేకుండా పెడసరం గా విసిరిన మాటలు పాల్గొనే వాళ్ళనే కాక చూసె వాళ్ళకు కూడా విసుకు, కోపం తెప్పించాయి. ఇక మన రెణుకా చౌదరి అయితె, ఇదేదో రాజకీయ పార్టీల, నేతల పైనే జరుగుతున్న పొరాటంలా వర్ణించి తన అసహనాన్ని వ్యక్తం చేసారు. అవినీతి బురద అంటించుకున్న ఈ ప్రభుత్వం లోని రాజాలు, కల్మాదీలు, ఆదర్ష్ కాలనీలు ఇలా... ఇవన్నీ ఈ రాజకీయ కొణం లొని భాగాలే.
ఇకపొతే, చేసేదేమీ లేక, కేవలం మూడు రొజుల్లొనే విజయవంతం గా ముగిసిన ఈ రాజకీయేతర విప్లవానికి తల వంచలేక, వంచలేక వంచిన కాంగ్రేస్, ఇది ప్రభుత్వం దిగివచ్చినట్లు కాదనీ ప్రజాస్వామ్య విజయం అనీ రక రకాలుగా ప్రకటనలిచ్చిన కపిల్ సిబాల్ మాటల్లొనే వారి అధికారం వీగిపొయింది. ఇది చాలక ఈ విజయం కొసం మన్మొహన్, సొనియా లు చాలా కృషి చేసారని ముక్తాయింపు ఒకటి.
ఎన్నికలలో కేవలం 30-40 శాతం ఓట్లతో విజయం పొంది, మూడొంతుల ఆధిక్యం తో గద్దెనెక్కే తమకు తరువాత ఇక ఎదురు లేదనుకునే రాజకీయ పార్టీలకు అన్ని ప్రభుత్వాలకు ఇది ఒక హెచ్చరిక.
కానీ ఇంతటితో ఈ సమరం ఆగకూడదు. ఈ చిగురేసిన మొక్కని అందరూ కలిసి పెంచి పెద్ద చేసి దాని ఫలాలను భావి తరాలకు అందించే బాధ్యత అందరూ తీసుకోవాలి. ఈ సామాన్యమైన పోరాటం ఏ రాజకీయ అండా దండా లేకుండా అనన్య సామాన్యం గా మారి రాజకీయ పార్టీలకు వణుకు పుట్టించాలి. ఈ గంగా ప్రవాహంలోకి ఏ కుళ్ళు రాజకీయ ఉపనదినీ కలవనీయకూడదు. ఏ కళంక నేతనూ ఈ వేదిక పైకి అనుమతించకూడదు. ఏ అరాచకీయ, రాజకీయ నేతల అప్రస్తుత ఊకదంపుడు ప్రసంగాలూ ఈ ఉద్యమ కారుల చెవిలో పడకూడదు. ఈ బృహత్కార్యానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఎవరో వొకరు ముందుకు నడవాలి.
ఆ ఒక్కరే ఈ "అన్నా హజారే"
ఆయనకు ప్రజలకు మధ్య ప్రసార మాధ్యమాలు వేసిన వారధి కలకాలం కొనసాగాలి. ఈ వేడి చల్లరగానే అవి మళ్ళీ తమ మూస పోసిన పాత కార్యక్రమాల లోకి, పార్టీల భజన లోకి వెళ్ళకూడదు.
ఇంత జరిగినా, ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఉత్తర్వు వచ్చేవరకూ దీక్ష విరమించానన్న 'అన్నా' నిజంగా అభినందనీయుడు. మన రాజకీయ నేతల నిరాహార దీక్షలు ఎన్ని చూడలేదు!!
అంకురం ఒక పుట్టుక
ఓ కొత్త చిగురు
ఒక పులకింత
ఒక ప్రక్రుతి వింత
ఈ అంకురం ఒక ఉత్తేజం
ఒక చైతన్యం
ఒక యువ తరంగం
ఒక ఉద్యమం
ఒక హెచ్చరిక
అవినీతి పూసుకున్న నేతలారా...
మాటలు ఆపండి... చేతలు చూపండి.
ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు !!
మీ మెడలు వంచగలరు !!
జయహో భారత్ ప్రజ, జైహింద్.
మల్లాది లక్ష్మణ కుమార్.
ఇన్నాళ్ళకు ఒక ప్రయోజనకరమైన పోరాటం మొదలైనట్టుంది.
రిప్లయితొలగించండిYes, the enthu must be sustained and channeled into specific goals that can be realized
రిప్లయితొలగించండిఇదిగో అన్నాహాజారు వేలై నినదిల్లు
రిప్లయితొలగించండిఅదిగో వేంచేయును లోక పాలక బిల్లు
ఇక కుంభకోణాల గుండెలు గుభిల్లు
ఇక వ్యక్తి స్వామ్యాల కలి కాలం చెల్లు
ఐక్య భారతి ప్రగతి జగతి తేజరిల్లు
కోటి కోటి కంఠ కల కల నినాద కరాలే
కోటి కోటి భుజైర్ధ్రుత ఖర కరవాలే
జై జై జై జయ భరత మాతె !!
chala manchi alochana. keep it up
రిప్లయితొలగించండి