31, మార్చి 2013, ఆదివారం


ఇంకొన్ని చక్రి కవితలు:

చడి చప్పుడు లేకుండా ఎప్పుడు ఎలా చేరి ఒదిగానో 
ఆకలి తాపాలు వేధిస్తే వేగలేక  తనువు మరచానో 
తడబడుతూ పడిలేస్తూ అందుకే  ఇలా ఎదిగానో 
తెలివి తెచ్చుకు నిలువెత్తు తెర దిమ్పుకున్నానో  
విధి మేర వింత కలబోత  తలదాల్చుకున్నానో 
మలి వేళన తెలిసి నిశ్చేష్టత అలము కుంటానో  
కలత నిదుర లో కలలని అన్వయిస్తానో  ?!!

      *               *                *

నీ అస్థిత్వానికి అనంత సాక్షి నేను
నీ ఆగమనాభిలాషి ఆతిధ్యము నేను   
నీ అనంత చెరగుల ఆధారమూ నేనే 
నీ  సవ్వడుల వెన్నంటి వచ్చేది నేనే  
నీవు నన్ను చీల్చుకు రావాలి 
నేను నిన్ను కమ్ముకు రావాలి 
నా బాహువుల్లోనే నీవు ఆడుకోవాలి 
నా కౌగిలిలో నీతో దోబూచులాడాలి 
ప్చ్ కానీ నీవెంటే  నేను కనుమరుగవ్వాలి 
ఇది విరామరహిత విన్యాస  కేళి 
ద్రష్ట దృష్టుల నవరస జావళి 
ఈ ఆనందమేనా  దీపావళి !!

ఉగాది కి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని ఆశిస్తూ 

4 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. మరండీ !!
      సంద్రంలో సుక్కండి,
      సినుకులో సిరుగండి,
      ఏడిసకలో పీసండి,
      పుత్తకాల్లో కాలీ కాయితవండి,
      సిరుగాల్లో సాసండి,
      కెరటాల కిస్సన్ది,
      సిటుక్కున పగిలే బుడగండి
      మావోడికిచ్ఛే సెయ్యండి
      సాపవండి, వరవండి,
      ఇంకా అండీ
      మనం సాలా అండి,
      మనం ముక్కెం కాదండి
      మనం పెసలేం కాదండి
      మనం ఒక్కసారే అన్నీ అండి
      మనం అండీ మడిసండి ,
      దేవుడు మన్నీ స్రుట్టి సేసాడండి
      మన్నందర్నీ అండి !!
      మరాండీ నేను సుక్కేస్తే ఎక్కువ మాటాడనండి !!
      స్ స్ స్ సప్పుడు సేయ్యమాకండి,
      పడుకోండి !!

      Just for fun... no offence meant !!
      Enjoy ;-)

      తొలగించండి
  2. మరండీ !!
    సంద్రంలో సుక్కండి,
    సినుకులో సిరుగండి,
    ఏడిసకలో పీసండి,
    పుత్తకాల్లో కాలీ కాయితవండి,
    సిరుగాల్లో సాసండి,
    కెరటాల కిస్సన్ది,
    సిటుక్కున పగిలే బుడగండి
    మావోడికిచ్ఛే సెయ్యండి
    సాపవండి, వరవండి,
    ఇంకా అండీ
    మనం సాలా అండి,
    మనం ముక్కెం కాదండి
    మనం పెసలేం కాదండి
    మనం ఒక్కసారే అన్నీ అండి
    మనం అండీ మడిసండి ,
    దేవుడు మన్నీ స్రుట్టి సేసాడండి
    మన్నందర్నీ అండి !!
    మరాండీ నేను సుక్కేస్తే ఎక్కువ మాటాడనండి !!
    స్ స్ స్ సప్పుడు సేయ్యమాకండి,
    పడుకోండి !!

    Just for fun .. no offence meant!!
    Enjoy ;-)

    రిప్లయితొలగించండి
  3. గతం రంగు వెలుస్తున్నా
    మనసు నశించిందేమీ ?
    వయసు మరపు తెస్తున్నా
    కర్మ వడి వాయదేమీ ?
    నిలదీయగల పరిచయమే
    వెనుతిరిగి మార్చలేనేమీ ?
    మమత పంచిన ఆదరువే
    ఆదుకోలేని నిర్బంధమేమీ?
    తీరం దారి తెలుస్తున్నా
    పడి లేచే తడబాటు తప్పదేమి ?

    రిప్లయితొలగించండి